గతంలో పదోతరగతి ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణతలు ఎలా వచ్చాయో కూడా అనుమానించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో మాట్లాడిన ఆయన పదో తరగతి లో బిట్ పేపర్లు తీసేయటం, స్కూళ్లు సరిగ్గా జరగకపోవటం, ఆన్ లైనులు క్లాసులు ఇలా చాలా విషయాలు పదోతరగతి ఫలితాలపై ప్రభావం చూపాయన్నారు.